అరసాడలో పైపుల లీకేజీ, నీటి వృధాపై గ్రామస్తుల ఆవేదన

వంగర మండలం అరసాడ గ్రామంలో తాగునీటి పైపులు లీకేజీ అవ్వడంతో నీరు వృధాగా పోతోంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇలాగే కొనసాగితే వేసవికాలంలో నీటి కొరత తప్పదని గ్రామస్తులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలను సరిచేసి, తాగునీటి సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్