కేంద్ర పథకాల అమలు పరిస్థితిని పరిశీలించేందుకు నేషనల్ లెవెల్ మానిటర్స్ కమిటీ బృందం శుక్రవారం విజయనగరం జిల్లాకు వచ్చింది. సునీల్ బంట, నాతు సింగ్ నేతృత్వంలో బృందం బాడంగి, బొబ్బిలి, విజయనగరం మండలాల్లో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ పర్యటన వివరాలను వెల్లడించారు. అధికారులంతా సహకరించాలని సూచించారు.