పాచిపెంట పోలీస్ స్టేషన్, పి. కొనవలస చెక్‌పోస్ట్ ఆకస్మిక తనిఖీ

పార్వతీపురం సబ్ డివిజినల్ అధికారి మనీషా రెడ్డి పాచిపెంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, లాకప్, ప్రాపర్టీ రూమ్, రిసెప్షన్ కౌంటర్, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల రికార్డులను పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పి. కొనవలస అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసి వాహనాల తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్