సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షలకు 63 మంది విద్యార్థులు హాజరయ్యారు. . అందరూ ఉత్తీర్ణులై మొదటి స్థానంలో నిలిచారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పదో తరగతిలో ఫలితాలు సాధించడం, మొదటి స్థానంలో నిలవడంతో, ప్రభుత్వం గిరిజన పాఠశాలలోని ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గుర్తించింది. బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ప్రధానోపాధ్యాయురాలుగా సంధ్యారాణిని, గణితం, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఆంగ్ల భాషలను బోధిస్తున్న ఉపాధ్యాయులకూ అవార్డులు ప్రదానం చేసింది.