విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అశ్రద్ధగా ఉండరాదని పార్వతీపురం ఐటిడిఎ పిఓ అశుతోష్ శ్రీ వాత్సవ అన్నారు. బుధవారం సాలూరు మండలంలోని తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు విచ్చేసిన ఆయన పాఠశాల తరగతి గదులు, ఆవరణ, వంట గది, బాత్ రూంలను పరిశీలించారు. అలాగే పాము కాటుకు గురైన విద్యార్ధి కొర్రా సునీల్ ఆరోగ్యం, పిల్లాడు బయటకు వెళ్ళే పరిస్థితి గూర్చి ప్రిన్సిపాల్, వార్డెన్ లను ప్రశ్నించారు.