శృంగవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలోని పెట్రోల్ బంకులో అక్రమ విక్రయాలపై సోమవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పెట్రోల్ నాణ్యత, నిల్వలను పరిశీలించి, వాహనదారులకు మాత్రమే ఇంధనం విక్రయించాలని, బాటిల్స్‌లో అమ్మకాలను నిషేధించాలని ఆదేశించారు. ఈ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.