అనధికారిక పాఠశాలలపై అధికారుల కొరడా: మూసివేయాలని ఆదేశం

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అనధికారిక పాఠశాలలు నడుస్తున్నాయనే ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ అధికారి, సీడీపీఓ పరిశీలనకు వెళ్లారు. ఐదేళ్లలోపు పిల్లలకు అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను తక్షణమే మూసివేయాలని అధికారులు హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన విద్య అందడం లేదనే తల్లిదండ్రుల వాదనతో, పిల్లలందరినీ అంగన్‌వాడీల్లో చేర్పించాలని, ఏవైనా ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని సీడీపీఓ అచ్యుతాంబ సూచించారు.

సంబంధిత పోస్ట్