ఎస్ కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని సిఐ నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజా శాంతి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.