కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ గా టి.వి.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిఐ సిహెచ్ సణ్ముఖరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. నూతన సిఐ మాట్లాడుతూ గంజాయి, దొంగతనాలు సవాళ్లుగా ఉన్నాయని, ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముందుంటామని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.