విజయనగరంలో కొత్త విద్యుత్ లైన్ ప్రారంభం

విజయనగరంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు వి. టి. అగ్రహారం నుంచి దాసన్నపేట వరకు రూ. కోటి వ్యయంతో కొత్త 33 కేవీ హెచ్ఐటి లైన్తో ఫీడర్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆదితి దీనిని మంగళవారం  ప్రారంభించారు. ఈ కొత్త ఫీడర్ వల్ల వోల్టేజ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వేసవిలో ఎదురయ్యే లోడును దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం తగ్గే అవకాశముంది.

సంబంధిత పోస్ట్