విజయనగరం: ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి

విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో రోడ్ షో, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని డి. ఎస్. పి ఎం శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 30, పోలీస్ చట్టం 1861 ప్రకారం ఈ ఆంక్షలు నెలరోజుల పాటు ఉంటాయని తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్