విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతులకు బ్రేక్

AP: విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతులకు ఎండల తీవ్రత అడ్డుతగిలింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్ల కారణంగా పనులు చేపట్టడం సాధ్యం కాదని ఆర్&బీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. మరమ్మతులు చేసినా రోడ్డు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని, వాతావరణం సాధారణ స్థితికి వచ్చాకే పనులు చేపట్టాలని లేఖలో పేర్కొంది. దీంతో రేపటి నుంచి ఘాట్ రోడ్డు యధావిధిగా అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్