విజయవాడ మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ టెండర్ల గడువును ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (APMRC) మరో 10 రోజులు పొడిగించింది. ఈ నెల 24 వరకు గడువు పొడిగించడంతో టెండర్లలో పాల్గొనే కంపెనీలకు ఉపశమనం లభించింది. ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, కాంట్రాక్టు సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొదటి దశలో గన్నవరం–పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, అక్కడి నుంచి పెనమలూరు వరకు 38.40 కి.మీ. మార్గాన్ని రూ.11,009 కోట్లతో నిర్మించనున్నారు.

సంబంధిత పోస్ట్