విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. 15 మంది సస్పెండ్

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. భద్రతా లోపాలు, నాసిరకం ముడి పదార్థాల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో అవి నిజమని తేలడంతో 15 మంది అధికారులను సస్పెండ్ చేసింది. ఇందులో SMS-1 విభాగంలో ఐదుగురు, SMS-2లో ఐదుగురు, RED విభాగంలో మరో ఐదుగురిపై వేటు పడింది. అదనంగా 19 మందిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది. ఇటీవల ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రావణం కిందపడిన ఘటనతో పాటు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించడంతో యాజమాన్యం విభాగాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లో మరికొందరిపై కూడా చర్యలు తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్