అనకాపల్లి జిల్లాలో 351 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

జిల్లాలో జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న 351 మందికి మొదటి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డి. ఎం. ఎ. సి కమిటీ సభ్యులకు అక్రిడిటేషన్ కార్డులను ఆమె స్వయంగా అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని, అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు త్వరలోనే ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, డి. ఐ. పి. ఆర్. ఓ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్