అనకాపల్లి;ప్రజా ఫిర్యాదుల వేదికలో 70 ఫిర్యాదుల స్వీకరణ

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మొత్తం 70 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ తగాదాలు 32, కుటుంబ కలహాలు 5, మోసానికి సంబంధించిన 2, ఇతర విభాగాలకు చెందినవి 31 ఉన్నాయి. ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 7 రోజుల్లో విచారణ పూర్తిచేసి తగిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్