ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా అనకాపల్లి కలెక్టర్ కార్యాలయ కో ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వీ.ఎస్. నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా బుచ్చియ్యపేట మండల డిటీ శ్రీరామ్మూర్తి, కోశాధికారిగా ఎలమంచిలి తహసిల్దార్ కే. వరహాలు ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా కలెక్టరేట్ డిటీ కే. సురేష్ నాయుడు, కోటవురట్ల డిటీ పి. రమేష్, డిటీ తహసిల్దార్ ఎమ్మెస్ అరుణ్ కుమార్, గొలుగొండ డిటీ సి.వి. చైనులు, కలెక్టరేట్ డిటీ ఎం. జయశ్రీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ శాఖ కార్యకలాపాలకు సంబంధించినవి.