అనకాపల్లి: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం కోసం 'ఎస్పీ-సంపర్క్' ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు సిబ్బంది సమస్యలను ఫోన్ ద్వారా ఆలకిస్తున్నారు. పోస్టింగులు, బదిలీలు, సెలవులు, కుటుంబ ఆరోగ్య సమస్యలపై వినతులు స్వీకరించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్