అనకాపల్లి గవరపాలెం పీలా వారి గౌరమ్మ గుడి సమీపంలో, నూకాలమ్మ గుడికి వెళ్లే ప్రధాన రహదారిపై మూడు రోజులుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని జివిఎంసి అధికారులను స్థానికులు కోరుతున్నారు.