అనకాపల్లి: రెవెన్యూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

అనకాపల్లి జిల్లాలో ప్రజల రెవెన్యూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శౌర్యా మాన్ పటేల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో, 4వ విడత రీ-సర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలని, పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కారంలో జాప్యం చేయరాదని, ఆన్‌లైన్ సేవలు, మ్యుటేషన్ దరఖాస్తులపై దృష్టి సారించాలని తహసీల్దార్లకు సూచించారు. వివాదరహిత భూ రికార్డులు, పారదర్శక పాలనే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్