అనకాపల్లి; ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీ.

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం సాయంత్రం కైలాసగిరిలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. కైలాసగిరి చేరుకున్న ఎస్పీకి జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పూల మొక్కలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు బలగాల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తనిఖీల్లో భాగంగా నిర్వహించిన 'స్టాఫ్ పీరియడ్'లో ఎస్పీ సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్