అనకాపల్లి: రావుగోపాలరావు కళా కేంద్రం పునరుద్ధరణ వేగం

అనకాపల్లి పట్టణంలోని రావుగోపాలరావు కళా కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి రత్నాకర్ సందర్శించారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కాలంలో నిర్మితమైన ఈ కళా కేంద్రం పునరుద్ధరణకు రూ. 3 కోట్ల నిధులు కేటాయించి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కళా కేంద్రంలో మినీ ఫంక్షన్ హాల్, షాపులు, ఆధునిక గదులు ఏర్పాటు చేస్తుండగా, మే నెలలోనే ప్రజా ప్రతినిధుల సమక్షంలో పునఃప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్