జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో శుక్రవారం కార్యనిర్వహణాధికారుల మార్పు సమావేశం నిర్వహించారు. బదిలీపై 1వ బెటాలియన్, శ్రీకాకుళం కు వెళ్లిన కార్యనిర్వహణాధికారి ఏ. రామ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యనిర్వహణాధికారి సి. హెచ్. తిలక్ బాబును స్వాగతించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో రామ్ కుమార్ సేవలు కొనియాడారు.