చోడవరం: రోగుల సౌకర్యం స్టీల్ బెంచిలు ఏర్పాటు

చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది సౌకర్యార్థం గూనూరు ఎర్ర అప్పలనాయుడు తన సొంత నిధులతో 50 వేల రూపాయలు వెచ్చించి 50 బెంచీలను తయారు చేయించి ఆసుపత్రికి అందించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు సమక్షంలో ఈ బెంచీలను ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గునూరు మల్లు నాయుడు, గూనూరు శేఖర్, హాస్పిటల్ చైర్మన్ వెంకట అప్పారావు, హాస్పటల్ డైరెక్టర్ దాలి బోయిన దేవుడు, పప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్