మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4. 06 లక్షల ఆర్థిక సాయం

నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధి నిర్వహణలో అనారోగ్యంతో మరణించిన హోంగార్డు పంచద వెంకటరమణ కుటుంబానికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అండగా నిలిచారు. శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో మృతుడి భార్య భవానికి రూ. 4,06,535/- నగదు చెక్కును అందజేశారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని హోంగార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చి ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తోటి సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్