రేపు అనకాపల్లి కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ వేదికలలో సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు అర్జీదారులు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయాలని సూచించారు. హాజరు కాలేని వారు 'మీ కోసం' పోర్టల్ ద్వారా కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్