అనకాపల్లి పట్టణం లక్ష్మీనారాయణ నగర్ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రింగ్ రోడ్డు, నెయ్యిల వీధి, మళ్ల వీధి, పెరుగు బజార్, కోట్ని వీధి, చిన్న వీధి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.