అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యలపై నిరసన

అనకాపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం గురువారం సిద్దార్ధ సోషల్ సర్వీస్ అండ్‌ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్. టి. ఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అధ్యక్షుడు బల్లా నాగభూషణం మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లు, రోడ్లపై ఆక్రమణలు, ట్రాఫిక్ నియంత్రణ లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఆర్‌టీఓ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్