అనకాపల్లి జిల్లాలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ (సీసీటీఎన్ఎస్) వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు బుధవారం అనకాపల్లి రోటరీ క్లబ్‌లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణలో సీసీటీఎన్ఎస్ అప్‌డేట్స్‌ను సమయానికి నమోదు చేయడం, పెండింగ్ లేకుండా డేటాను అప్‌లోడ్ చేయడం, రికార్డుల ఖచ్చితత్వాన్ని కాపాడడం వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించారు.