అనకాపల్లిలో ముగ్గురు పోలీసు అధికారుల పదవీ విరమణ

అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో దశాబ్దాల పాటు సేవలందించిన ముగ్గురు అధికారులు మంగళవారం పదవీ విరమణ చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్సై బి. మల్లికార్జున రావు, ఏఆర్ఎస్ఐ పి. సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటరావులకు అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. 40 ఏళ్లకు పైగా నిబద్ధతతో పనిచేసిన వారి సేవలను కొనియాడుతూ, వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్