అనకాపల్లి ఉత్సవ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

ఈనెల 30, 31 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహించే ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హ తెలిపారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి. విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం, బెల్లం మార్కెట్, ముత్యాలమ్మ పాలెం బీచ్, కొండకర్ల ఆవ ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తారు.

సంబంధిత పోస్ట్