అరకు సంతబయలు సంత వేలం 30న

అరకు సంతబయలు సంత వేలంపాటను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి గుణలక్ష్మి తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలచిన అభ్యర్థులు రూ. 2,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలని సూచించారు. ఈసారి సంతను రూ. 6.17 లక్షల ప్రాతిపదికన వేలంపాటకు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంత అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్