డుంబ్రిగూడ: చెత్త దుర్వాసనతో ఇబ్బందులు

డుంబ్రిగూడ పశు వైద్యశాల వీధిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికుడు మండ్యాగురు వరుణ్ రాజ్ తెలిపారు. చెత్త ఒకేచోట పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్