శ్రమదానంతో రోడ్డు మరమ్మతులు

డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ కుమిడికుంటి గ్రామంలో రహదారి దుస్థితిపై గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డును మరమ్మతు చేశారు. సంవత్సరాలుగా సరైన రహదారి లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భారీ వర్షాలతో రోడ్డు దెబ్బతినడంతో బండరాళ్లు పేర్చి, మట్టి పోసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గ్రామానికి సీసీ లేదా బీటీ రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్