కోర్రా గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం

డుంబ్రిగూడ మండలంలోని కోర్రా గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. గ్రామంలోని కింది వీధిలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండిపోతోంది. దీంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ నీటి కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్