అరకులోయలో కార్మికుల సమ్మె: చెత్తకుప్పలతో దుర్గంధం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక కేంద్రమైన అరకులోయలో పెదలబుడు పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుండి సమ్మెకు దిగారు. గత నాలుగు నెలలుగా వేతన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని కార్మికులు తెలిపారు. వీరి సమ్మె కారణంగా అరకులోయ పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ సమ్మెతో అరకులోయ అందాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్