అరకు రానున్న వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 10.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అరకు బయలుదేరారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, రోడ్డుమార్గంలో రాణా ప్రతాప్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ నివాసానికి వెళ్లి, ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు, కోడలిని ఆశీర్వదిస్తారు.

సంబంధిత పోస్ట్