భీమిలి: రుషికొండ బీచ్‌ను సందర్శించిన కలెక్టర్

విశాఖపట్నం: రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్, సాహస క్రీడల కార్యకలాపాలు, ఏపీటీడీసీ సమాచార–రిజర్వేషన్ కౌంటర్‌ను కలెక్టర్ అభిషిక్త్‌ కిశోర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో నిర్వహించాలని, సందర్శకులకు సరైన పార్కింగ్ సదుపాయం కల్పించాలని అధికారులకు సూచించారు. ఋషికొండ బీచ్‌ను సందర్శించే పర్యాటకుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జగదీష్, మధురవాడ జోన్ జోనల్ కమిషనర్ వి. అయ్యప్పనాయుడు, పీజీ సర్వీసెస్ ప్రతినిధి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్