భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలు, ప్రీమియం ఇంటీరియర్లతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద విమానయాన మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతికి కీలకం కానుంది అని అధికారులు భావిస్తున్నారు.