భీమిలి: గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

భీమిలి సీహెచ్సీకి వచ్చిన గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, పేషెంట్లకు అందుతున్న సేవలు తెలుసుకున్నారు. సుఖ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, పడకల సంఖ్య 30 నుంచి 50కి పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్