భీమిలి: గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి

భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణుల విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. భీమిలి సీహెచ్‌సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పేషెంట్ల వార్డులకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీలైనంత వరకు సుఖ ప్రసవాలు జరిగేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్