విశాఖ పోర్టులో రికార్డు స్థాయి కార్గో హ్యాండ్లింగ్

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి 28వ తేదీ నాటికి 90.29 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాక్ ఫాస్ఫేట్, అల్యూమినియం పౌడర్, స్టీల్ ప్లేట్లు, గ్రానైట్ వంటి సరుకుల ఎగుమతి, దిగుమతులు పెరగడంతో కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని అధిగమించారు. సిబ్బంది, కార్మికుల కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని పోర్ట్ యాజమాన్యం తెలిపింది.

సంబంధిత పోస్ట్