మంగళవారం భీమిలిలోని ఎండాడ పాఠశాలలు, సాగరనగర్–1 సచివాలయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. సచివాలయంలో 400 ఈకేవైసీలు పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని, లేదంటే బాధ్యులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.