విశాఖ‌: జూన్ నుంచి భోగాపురం నుంచి విమాన రాకపోకలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రన్‌వే, టాక్సివే, టెర్మినల్ బిల్డింగ్, ఫైర్ సేఫ్టీ, ఏటీసీ టవర్ వంటి కీలక పనులు 100 శాతం పూర్తయ్యాయి. జనవరిలో వ్యాలిడేషన్ ఫ్లైట్ ట్రయల్ విజయవంతం కావడంతో విమాన రాకపోకలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి విమాన కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి.

సంబంధిత పోస్ట్