విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ఎంపీ భరత్

విశాఖ ఎంపీ శ్రీ భరత్ శుక్రవారం నగరంలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించి, ఖైదీల బ్యారక్లు, ఆసుపత్రి, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఫ్యాక్టరీలు, వంటశాల వంటి విభాగాలను పరిశీలించారు. ఖైదీల సంక్షేమం, వైద్య సేవలు, ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న విద్యా, వృత్తి శిక్షణా కార్యక్రమాల వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు. జైలు ప్రాంగణంలో పరిశుభ్రత, క్రమశిక్షణ, భద్రతా ఏర్పాట్లపై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి తోడ్పడే నైపుణ్యాభివృద్ధి చర్యలు, నాణ్యమైన ఆహార తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్