విశాఖ ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గురువారం భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ప్రధాన రహదారి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అడవివరం కూడలి నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, స్వయంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించి రోడ్ల నాణ్యతను పరీక్షించారు. జూన్ మొదటి వారం నాటికి ఏడు ప్రధాన రహదారులను పూర్తి చేస్తామని, అటవీ భూముల సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. ప్రజల సహకారంతో పనులు వేగంగా సాగుతున్నాయని కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు.