పాడేరులో ట్రాఫిక్, సైబర్ నేరాలు, గంజాయిపై అవగాహన సదస్సు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కాంప్లెక్స్ వద్ద, సీఐ దీనబంధు, ఎస్సై పాపి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు జరిగింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పవద్దని హెచ్చరించారు. గంజాయి వినియోగం, రవాణా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాహన యజమానులు, వ్యాపారులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్