రావికమతం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో కొత్తకోట సెక్టార్ లో రెండో అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీడీపీఓ మంగతాయారు మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలని, తల్లి పాలలో వుండే పోషకాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి తోపాటు తల్లి బిడ్డకు అనుబంధంపెరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పౌస్టికహారం క్రమంతప్పకుండా తీసుకోవాలన్నారు.