చోడవరం నియోజకవర్గంలో అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్ రాజు చెప్పారు. దాంట్లో భాగంగా చోడవరం మండలంలో 202 నూతన జీవిత భాగస్వామి పెన్షన్ లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసులమ్మ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.