విశాఖ బీచ్ రోడ్‌లో అమరవీరుల స్మృతిగా కొవ్వొత్తుల ర్యాలీ

విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ పాండురంగాపురం నుంచి అమరవీరుల స్మృతి స్థూపం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం, పోలీసు అమరవీరుల వారోత్సవాలు ముగిసిన శుక్రవారం కావడం విశేషమని, 'వారు మన రేపటి కోసం తమ నేటిని త్యాగం చేశారు' అని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్